డిగ్రీ అధ్యాపకులకు ఇక యూజీసీ పే స్కేల్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న డిగ్రీ అధ్యాపకులకు (డీఎల్స్) 2015 రాష్ట్ర పే స్కేల్ నుంచి 2006 యూజీసీ పే స్కేల్‌కు మారడానికి కన్వర్షన్ ఫార్ములాను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.

దీంతో వారికి యూజీసీ పేస్కేల్ ప్రకారం ఫిట్‌మెంట్ పొందెందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ చంద్రన్ జీవో 12 జారీ చేశారు. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తూ పదోన్నతిపై డిగ్రీ లెక్చరర్లుగా వెళ్లిన వారు ఇంకా రాష్ట్ర వేతన స్కేల్ పరిధిలోనే ఉన్నారు. అయితే వారు యూజీసీ పేస్కేల్ పరిధిలోకి మారి, వేతన స్థిరీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

2016 జనవరి 1న, ఆ తర్వాత డిగ్రీ లెక్చరర్ లుగా పదోన్నతులు పొందిన వారికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయని వెల్లడించాయి.

GO. No. 12 pdf file

https://drive.google.com/file/d/1jdLYgwM-zSvNDdWPKR9DBRDljfdhR5l8/view?usp=drivesdk

Follow Us @