UGC : పీజీ ఓకే ఏడాది లో పూర్తి

BIKKI NEWS : నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు ఏడాదిలోనే పీజీ పూర్తి చేసేలా నిబంధనలను తేవాలని విశ్వవిద్యాలయాల నిధుల కమిషన్ (UGC) నిర్ణయించింది. దీంతోపాటు పీజీ విద్యార్థులు సబ్జెక్టులను మార్చుకునే అవకాశం ఇవ్వనుంది. (UGC new guidelines for pg courses)

అభ్యసన విధానాన్ని ఆఫ్లైన్, డిస్టెన్స్, ఆన్లైన్, హైబ్రిడ్ విధానంలో దేన్నైనా విద్యార్థులు ఎంచుకునేలా అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్ కరికులంతో పాటు క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ముసాయిదాను యూజీసీ సిద్ధం చేసింది.

ఈ ముసాయిదాను అందరికీ అందుబాటులో ఉంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ‘ఏడాది, రెండేళ్లు, ఐదేళ్ల సమీకృత పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, వర్క్ ఎక్స్పీరియన్స్, సబ్జెక్టుల మిళితం ద్వారా అత్యున్నత స్థాయి విద్య అందనుంది’ అని ఆ ముసాయిదా వెల్లడించింది.