హైదరాబాద్ (ఆగస్టు – 18) : విదేశీ యూనివర్సిటీలు దేశంలో విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త (ugc new guidelines for foreign degree genuinity) మార్గదర్శకాలను జారీ చేసింది.
విదేశీ విద్యాసంస్థలు అందించే డిగ్రీ సహా పలు కోర్సుల గుర్తింపునకు సంబంధించి యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన విదేశీ విద్యా సంస్థలు జారీ చేసే డిగ్రీలకే భారత్ లో సమానత్వ గుర్తింపు లభిస్తుందని తెలిపింది. ఈమేరకు ముసాయిదాని యూజీసీ సిద్ధం చేసింది.
‘విదేశీ వర్సిటీలు జారీచేసే సర్టిఫికెట్స్ కు ఆ దేశంలో ఉన్నత విద్యాసంస్థ గుర్తింపు కలిగి ఉండాలి. రెగ్యులర్ పద్ధతిలో కోర్సు చదివి ఉండాలి. ఆన్లైన్, డిస్టెన్స్ పద్ధతిలో ఉండరాదు’ అని యూజీసీ పేర్కొంది.