హైదరాబాద్ (ఫిబ్రవరి – 14) : యూజీసీ నెట్ డిసెంబరు 2022 తొలి విడత పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్నాయి. 57 సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది.
డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొపెసర్ పోస్టులకు అర్హత సాదించడానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ అర్హత సాదించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.