UGC NET : రెండో దశ పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 21) : యూజీసీ నెట్ డిసెంబరు 2022 రెండో విడత పరీక్షలు 5 సబ్జెక్టులకు గాను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ప్రీ అడ్మిట్ కార్డులను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా పరీక్ష కేంద్రాలను తెలుసుకోవచ్చు.

ఫైనల్ అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. రెండో దశలో 5 సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది.

డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొపెసర్ పోస్టులకు అర్హత సాదించడానికి యూజీసీ నెట్ అర్హత సాదించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

◆ వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/