యూజీసీ – నెట్‌ 2021 పరీక్ష తేదీలు విడుదల

యూజీసీ – నెట్‌ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

  • NET లో స్కోరు సాధిస్తే జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాదిస్తారు.
  • ఈ పరీక్షలకు తేదీలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు.
  • UGC NET పరీక్ష ఆన్లైన్‌లో జరగనుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి నేటి నుంచి మార్చి 2 వరకు కలదు
  • మార్చి 3 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
  • నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైనవారు స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
  • జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్‌, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.

● వెబ్సైట్ ::

https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P

Follow Us@