హైదరాబాద్ (అక్టోబర్ – 02) : జాతీయ స్థాయిలో నకిలీ వర్సిటీల తాజా జాబితాను (Ugc fake universities list 2023) యూజీసీ విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 8 ఫేక్ వర్సిటీలు ఉన్నట్టు తేలింది.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 4, పశ్చిమబెంగాల్ లో 2, ఆంధ్రప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కోటి చొప్పున ఉన్న ఫేక్ వర్సిటీల జాబితాను యూజీసీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆయా వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులకు యూజీసీ లేఖలు రాసింది.
చెల్లని డిగ్రీలను ప్రదానం చేస్తున్న ఫేక్ విద్యాసంస్థలు, వర్సిటీలకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని యూజీసీ వర్గాలు హెచ్చరించాయి. నకిలీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందే
సమయంలోనే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది.