BIKKI NEWS (MAR 30) : Ugadi special telugu poetry by addagudi Umadevi. ఉగాది సందర్భంగా ప్రముఖ కవయిత్రి ఆడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక కవిత్వం.
Ugadi special telugu poetry by addagudi Umadevi.
పరవశము
పుడమి తల్లి చిత్ర వర్ణాలనద్దుకొని పులకించ
వేపలు నిండుగపూసి వెండివోలె మెరువగా….
చూత పల్లవములనారగించిన
పికముల కూజితములు సుస్వరాలై మది ఆనందడోలికలూగగా…
కసుగాయల సింగారించుకొని సిరికి మురిసిపోయే ఆమ్రవనాలు….
చింతలు భారాన్ని రాల్చుకొని
ఫలాన్ని పంచి
చింతదీర్చుకోగా….
మోదుగువనం నూతన దంపతులకు మంగళహారతి పట్టగా ….
గుడి పూజారులు లాభ నష్టాలు బేరీజు వేస్తూ
పంచాంగ శ్రవణం చేయగా…
కష్ట సుఖాలు అమాస పున్నమలై కన్ను తడవని
ప్రతీ గడపకూ యుగాది
పరవశమే….
సీసం:
ప్రకృతి శోభ
పండుటాకులనొదిలి పసరాకులదొడిగి
ప్రకృతి కాంత జుట్టు పచ్చ వలువ
చూతపల్లవముల చుంబించి పికములు
మధుర గానముజేయు మాసమిదియె
వేప పాదపములు వెండివోలెను బూయ
గోగుపూలసొగసు గొప్పగుండు
ఇనుడు తాపము బెంచ యింకిపోవగ నీరు
ధరణి జీవులకంత దప్పిబెరుగు
ఆటవెలది:
కష్ట సుఖములనెడి కలబోత సారమై
ఆరు రుచులు గల్గునది యుగాది
విశ్వమంత గొలువ విశ్వావసుగరాగ
సూర్యుడధిపతయ్యె శుభములిడగ
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్