హైదరాబాద్ (జనవరి – 29): అండర్ 19 మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో టీం ఇండియా ఇంగ్లాండ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి మొదటి టైటిల్ ను కైవసం (U19 WOMEN WORLD CUP WON BY INDIA) చేసుకుని విశ్వ విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు బౌలర్లు విజృంభించి బౌలింగ్ వేయడంతో వరుస విరామాలలో ఇంగ్లండ్ జట్టు వికెట్లు కోల్పోయింది. సంధం, అర్చన దేవి, పరశ్వి చోప్రా రెండేసి వికెట్లతో రాణించడంతో ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం 69 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు త్రిష 24, తివారీ 24* పరుగులతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాదించింది.