BIKKI NEWS : వెస్టిండీస్ లో జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. అంటిగ్వాలో జరిగిన పైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టును ఓడించి 5వ సారి U19 క్రికెట్ ప్రపంచ కప్ ను ముద్దాడింది యష్ దూల్ నేతృత్వంలోని యువ భారత జట్టు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 189 పరుగులకు ఆలౌట్ కాగా… భారత జట్టు 6 వివిధ వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.
లీగ్ దశ నుండి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అప్రతిహతంగా, అజేయంగా సాగింది యువ భారత జైత్రయాత్ర.
★ U19 ప్రపంచ కప్ విశేషాలు
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ – డెవిస్ బ్రెవిస్ – సౌతాఫ్రికా
మ్యాన్ ఆఫ్ ది పైనల్ మ్యాచ్ – రాజ్ బవ(ఇండియా)
అత్యధిక పరుగులు – 506 (డెవిస్ బ్రేవిస్ – సౌతాఫ్రికా)
అత్యధిక వికెట్లు – 17 (డునిత్ వెలేజ్ – శ్రీలంక)
అత్యధిక స్కోర్ – రాజ్ బవా (ఇండియా) – 162*
అత్యధిక టీమ్ స్కోర్ – 405/5 (భారత జట్టు)