అండర్-19 ఆసియా కప్ క్రికెట్ ట్రోఫీని భారత్ ఎన్నోసారి గెలుచుకుంది.?

దుబాయ్ :: 2021 – అండర్-19 ఆసియా కప్ క్రికెట్ ట్రోఫీని యువ భారత జట్టు.. ఎనిమిదోసారి చేజిక్కించుకుంది. శ్రీలంకతో జరిగిన పైనల్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత లంక 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. అనంతరం 32 ఓవర్లలో లక్ష్యాన్ని 102గా నిర్ణయించగా… భారత జట్టు 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి కప్ కైవసం చేసుకుంది.

Follow Us @