హైదరాబాద్ (మే 14): టైపు రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను జూలైలో నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు తెలిపారు.
రూ.400/- ఆలస్య రుసుంతో ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగియనుండగా, ఈ నెల 26 వరకు రూ.5 వేలతో ప్రీమియం తత్కాల్ కింద పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.