హైదరాబాద్ (నవంబర్ 14) : టైపు రైటింగ్ పరీక్షలను 2024 జనవరి 20, 21న, షార్ట్ హ్యాండ్ పరీక్షలను జనవరి 28న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. Type writing and short hand exam notification
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు డిసెంబర్ 16 వరకు ఫీజు చెల్లించాలని, రూ. 400 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.3వేల జరిమానాతో తాత్కాల్ కింద డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వివరించారు. రూ.5వేల ప్రీమియం తాత్కాల్ స్కీం కింద పరీక్ష రోజు ముందువరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.