BIKKI NEWS : ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఒకే వాట్సప్ యాప్ ద్వారా రెండు వేర్వేరు నంబర్ల వాట్సప్ ఖాతాలను (Two Whatsapp accounts with one App) లాగౌట్ కాకుండానే నిర్వహించుకోవచ్చని మెటా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్ లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక నంబరుతోనే వాట్సప్ వినియోగించుకునే అవకాశముంది. రెండో నంబరును వాడాలంటే మొదటి నంబరు నుంచి లాగౌట్ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది.
కొత్తగా వచ్చే ఫీచర్ తో రెండు నంబర్లను ఉపయోగించుకుని రెండు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఈ విషయాన్ని గురువారం మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు.