ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి 2022 సంవత్సరం నుండి ఆడనున్న రెండు కొత్త జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. దీంతో మొత్తం ఐపీఎల్ టోర్నీలో జట్ల సంఖ్య పదికి చేరింది.

అహ్మదాబాద్, లక్నో నగరాల పేరు మీద ఈ జట్లు చోటు దక్కించుకున్నాయి.. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ దక్కించుకోగా, లక్నో ను ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ ₹5,600 కోట్లకు , ఆర్పీఎస్జీ గ్రూప్‌ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.