Home > SCIENCE AND TECHNOLOGY > D2M – సిమ్‌, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో టీవీ ప్రసారాలు

D2M – సిమ్‌, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో టీవీ ప్రసారాలు

BIKKI NEWS (JAN. 17) : సిమ్‌ కార్డ్, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో టీవీ కార్యక్రమాలు ప్రసారమయ్యే సరికొత్త సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది దేశీయంగా అభివృద్ధి చేసిన ‘డైరెక్ట్‌-టు-మొబైల్‌’ (D2M) సాంకేతికత ద్వారా వాటిని ప్రసారం (TV BROADCASTING WITHOUT SIM and INTERNET ON MOBILES D2M) చేయనున్నారు.

D2M ప్రసారాల కోసం 19 నగరాల్లో 470-582 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ”డీ2ఎం సాంకేతికతను నిరుడు బెంగళూరు, దిల్లీలోని కర్తవ్యపథ్‌, నొయిడా ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా పరీక్షించాం. భారత్‌లో 80 కోట్లమంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో 69 శాతం మంది వీడియో ఫార్మాట్‌లో కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. దీనివల్ల మొబైల్‌ నెట్‌వర్క్‌పై భారం పెరిగి కంటెంట్‌ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతోంది. కొత్తగా పరిచయం చేయనున్న బ్రాడ్‌కాస్టింగ్‌ సాంకేతికతతో వీడియో ప్రసారాలను కోట్లమంది నిరంతరాయంగా వీక్షించవచ్చు’.

★ WHST IS D2M

ఈ సాంకేతికత దాదాపు ఎఫ్‌ఎం రేడియో, డీటీహెచ్‌ తరహాలో పనిచేస్తుంది. ఇందులో బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌ టెక్నాలజీ కలిపి టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్‌ నేరుగా వస్తుంది. డీ2ఎంను ఐఐటీ ఖరగ్‌పూర్‌, శాంఖ్య ల్యాబ్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సాంకేతికతతో ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గడంతోపాటు నెట్‌వర్క్‌ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్‌ పంపేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది