TTWRIES COE-CET 2023 : ఇంటర్ గురుకుల ప్రవేశ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 02) : తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- (COE CET – 2023) నోటిఫికేషన్ విడుదలయింది. ఎంపికైన విద్యార్ధులకు ప్రతిభా కళాశాలల్లో ఇంటర్ ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షల శిక్షణ ఇస్తారు.

◆ గ్రూపులు: ఎంపీసీ (575 సీట్లు), బైపీసీ (565 సీట్లు).

◆ బోధనా మాధ్యమం: ఇంగ్లిష్,

◆ రిజర్వేషన్: అన్ని సీట్లు ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు కేటాయించారు.

◆ అర్హత: మార్చి-2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం); రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. ఇంగ్లిష్ / తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ సీట్ల కేటాయింపు : స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్, దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా

◆ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100/-

◆ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2023.

◆ స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 12-03-2023.

◆ వెబ్సైట్: www.tgtwgurukulam.telangana.gov.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @