BUS PASS RENEWAL ONLINE లోనే

హైదరాబాద్ (ఆగస్టు – 29) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విద్యార్థుల బస్ పాసుల రెన్యువల్ (STUDENT BUS PASS) విషయంలో ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే తమ నెలవారి, మూడు నెలల బస్ పాసులను రెన్యువల్ చేసుకోవచ్చు.

విద్యార్థులు బస్ పాస్ కోసం బస్ డిపోకు గాని బస్సు పాస్ సెంటర్ కి గాని ప్రత్యక్షంగా వెళ్లవలసిన అవసరం లేదని టిఎస్ఆర్టిసి ఒక ప్రకటనలో తెలిపింది.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు తమ బస్ పాస్ లను రెన్యువల్ చేసుకోవచ్చు మరియు నూతన బస్సు పాస్ లను పొందవచ్చు.

వెబ్సైట్ : https://online.tsrtcpass.in