హైదరాబాద్ (మే – 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే నెలలో 7 నోటిఫికేషన్ లకు సంబంధించిన ఉద్యోగ పరీక్షలను నిర్వహించనుంది.
పేపర్ లీకేజ్ అంశం తర్వాత వాయిదా పడ్డ పరీక్షలను, గతంలో ప్రకటించిన పరీక్షలను ఈ నెలలో నిర్వహించనున్నారు.
◆ పరీక్షల వివరాలు :
1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అగ్రికల్చర్) – మే – 08 (100 పోస్టులు)
2) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) (మే – 09) (97 పోస్టులు)
3) పాలిటెక్నిక్ లెక్చరర్ (మే – 13) (247 పోస్టులు)
4) అగ్రికల్చర్ ఆఫీసర్ (మే – 16) (148 పోస్టులు)
5) లైబ్రేరియన్ (మే – 17 (71 పోస్టులు)
6) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (మే – 19) (18 పోస్టులు)
7) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ – ఎలక్ట్రానిక్) (మే 21, 22) (1,343 పోస్టులు)