TSPSC : పరీక్షలు రీషెడ్యూల్ & CBRT విధానంలో పరీక్షలు.

హైదరాబాద్ (మార్చి – 25) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC PAPER LEAK) తో రద్దైన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును త్వరలో ప్రకటించనుంది. అలాగే ఇప్పటికే షెడ్యూలు వేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.

గ్రూప్-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పరీక్షను జూన్ 11 న నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అయితే… గ్రూప్-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. నూతన షెడ్యూల్ ను తేదీలను వారంలోగా ప్రకటించనుంది.

◆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ :

తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్) విధానంలో నిర్వహిస్తోంది. లీకేజ్ నేపథ్యంలో మరింత భద్ర లతోపాటు ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది.

మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్ అధికారులు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, భూగర్భ జల అదికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ల పరీక్షలను యదావిధిగా నిర్వహించాలా? రీషెడ్యూల్ చేయాలా అని సమాలోచనలు జరుపుతుంది.

◆ సైబర్ సెక్యూరిటీపై విధానం :

టీఎస్ పీఎస్సీలో సైబర్ నెహ్యరిటీ విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిషన్ పరిశీలిస్తోంది. వారం రోజులుగా ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ల ఐటీ విభాగాధిపతులు, సైబర్ నిపుణులతో సమావేశమైంది. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షల నిర్వహణ, కాన్పిడెన్షియల్ వ్యవహారాలు, సైబర్ నెక్యూరిటీ, అలర్ట్ సిస్టమ్ తదితర అంశాలను పరిశీలించిం చేయాల్సిన మార్పులు భద్రత విషయాలపై సూచనలు తీసుకుంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @