GROUP – 1 RESULTS : ఆగస్టులో ప్రిలిమ్స్ ఫలితాలు

హైదరాబాద్ (జూలై – 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగ‌స్టు మొద‌టి వారంలో GROUP – 1 PRELIMS RESULTS విడుద‌ల‌ చేయడానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. జూలై 24 లేదా 25వ తేదీలలో GROUP – 1 FINAL KEY ని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఈ ఏడాది జూన్ 11వ తేదీన నిర్వ‌హించిన గ్రూప్ – 1 పరీక్ష ప్రాథ‌మిక కీని కూడా కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీపై వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీకి టీఎస్‌పీఎస్సీ పంపింది. ఈ క్ర‌మంలో సోమ లేదా మంగ‌ళ‌వారాల్లో ఫైన‌ల్ కీని విడుద‌ల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుద‌ల చేసిన అనంత‌రం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల ఓఎంఆర్ షీట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నారు.