హైదరాబాద్ (జూలై 24): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) – GROUP – 3 EXAM ను అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.
వారం, పది రోజుల్లో గ్రూప్-3 పరీక్ష తేదీలను కమిషన్ వెల్లడించే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో స్టాప్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్
ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.