Home > JOBS > TELANGANA JOBS > TSPSC – 40 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్‌ల ప్రస్తుత పరిస్థితి

TSPSC – 40 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్‌ల ప్రస్తుత పరిస్థితి

BIKKI NEWS (DEC. 24) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), గురుకుల ఉద్యోగ నియామక బోర్డు (TREIRB), పోలీసు ఉద్యోగ నియామక బోర్డు (TSLPRB) లు దాదాపు 40 వేలకు పైగా పోస్టులకు(TSPSC TREIRB TSLPRB JOB NOTIFICATIONS PRESENT STATUS) నోటిఫికేషన్ ల నియామక ప్రక్రియలో రాత పరీక్షలు, ప్రాథమిక కీ లు, తుది కీ లు విడుదల చేసి కేవలం మెరిట్ జాబితాల విడుదల చేసి, కేవలం ఫలితాల ప్రకటన లో జాప్యం చేస్తుంది.

ఉద్యోగ నియామకాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, సాధారణ పరిపాలన శాఖ మహిళలకు సమాంత రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత స్పష్టత కోసం బోర్డులు ఎదురుచూస్తున్నాయి.

అలాగే టిఎస్పిఎస్సి సభ్యులు రాజీనామాలు ఆమోదం పొంది, నూతన టిఎస్పిఎస్సి చైర్మన్, సభ్యులు నియామకం జరిగిన తర్వాతనే నియామక ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.

TSPSC, విడుదల చేసిన 22 ఉద్యోగం నోటిఫికేషన్ పరీక్ష లలో గ్రూప్ – 2,.గ్రూప్ -3 పరీక్షలు ఇంకా జరగలేదు. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష పై ఇంకా స్పష్టత రాలేదు. మిగతా ఉద్యోగాల ప్రస్తుత పరిస్థితి చూద్దాం.

★ ఫైనల్ కీ విడుదలయ్యి ఫలితాలు వెలవడని పరీక్షలు

8,039 గ్రూప్ 4 ఉద్యోగాలు తుదికి విడుదలై పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు

77 లైబ్రేరియన్ ఉద్యోగాలు తుదికి విడుదలై పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు

18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు తుదికి విడుదలై పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు

1,540 AEE ఉద్యోగాలు జనరల్ ర్యాంక్ కూడా మొదలైంది. ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అయితే న్యాయవివాదం కారణంగా వాయిదా పడింది.

9,210 గురుకుల ఉద్యోగాలు తుదికి విడుదలయ్యింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో విడుదల చేసి దృవపత్రాలు పరిశీలించాల్సి ఉంది.

16,969 పోలీస్ ఉద్యోగాలు తుది జాబితాలు కూడా విడుదలయ్యాయి. నియామక ప్రక్రియ వైద్య పరీక్షలు దగ్గర నిలిచిపోయింది.

★ ప్రిలిమినరీ కి విడుదలైన పరీక్షలు

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు
833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
185 వెటర్నరీ సర్జన్ పోస్టులు
175 TPBO పోస్టులు
22 హర్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు
32 భూగర్భజలశాఖ అధికారులు (G.) పోస్టులు
25 భూగర్భజలశాఖ అధికారులు (Non G.) పోస్టులు
78 ఎకౌంట్స్ అధికారులు పోస్టులు
247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు

ఫిజికల్ డైరెక్టర్ మరియు లైబ్రేరియన్ (ఇంటర్ & సాంకేతిక విద్య)

★ తుది కీ విడుదలై పరిశీలనలో ఉన్న నోటిఫికేషన్

148 – అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు
113 – అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనిస్పెక్టర్ పోస్టులు

★నోటిఫికేషన్ వెలువడని ఉద్యోగాలు

491 డిగ్రీ లెక్చరర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉద్యోగాలు
29 – ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కళాశాల)
24- లైబ్రేరియన్ (డిగ్రీ కళాశాల)