TSPSC : టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ హల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(TPBO) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హల్ టికెట్లను విడుదల చేసింది. ఈ హల్ టిక్కెట్లు పరీక్షకు 45 నిమిషాలు ముందు వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

జూలై 8వ తేదీన TPBO పరీక్షను కంప్యూటర్ బెస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనున్నారు.

ఈ పరీక్షను రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.00 – 12.30 వరకు, రెండో సెషన్ 2.30 – 5.00 వరకు నిర్వహించనున్నారు.

TPBO HALL TICKETS DOWNLOAD LINK