హైదరాబాద్ (మార్చి 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో నిర్వహించిన వివిధ పరీక్ష పేపర్లు లీక్ (TSPSC PAPER LEAK) అవడంతో గ్రూప్ – 1 తో సహ పరీక్షలను రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ పరీక్షల రీషెడ్యూల్ ను నేడు TSPSC లో చర్చించి ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే ఉద్యానశాఖలో హార్టి కల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన ఉంది. అయినా ఇప్పటి వరకు కమిషన్ హాల్ టికెట్లు విడుదల చేయకపోవడంతో పరీక్ష ఉంటుందా? వాయిదా పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్ అధి కారులు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.