TSPSC JOBS – వెటర్నరీ, హర్టీకల్చర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెట‌ర్నరీ, హార్టిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ల‌లో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో 185 వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు, హార్టిక‌ల్చ‌ర్ విభాగంలో 22 హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది.

వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు ఈ నెల 30 నుంచి వ‌చ్చే నెల 19వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు.

హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి 3 నుంచి అదే నెల 24వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

◆ వెబ్సైట్ :https://websitenew.tspsc.gov.in/