హైదరాబాద్ (జూలై – 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో భర్తీ చేయనున్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేసింది.
పరీక్షలను అక్టోబర్ 18, 19, 20వ తేదీలలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 18, 19వ తేదీలలో సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు… 20 వ తేదీన మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్దతిలో పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది స్వీకరించనుంది.