TSPSC : పాలిటెక్నిక్ లెక్చరర్, పీడీ పరీక్షల నూతన షెడ్యూల్

హైదరాబాద్ (మే – 09) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు, ఇంటర్మీడియట్, సాంకేతిక విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల నూతన తేదీలను వెల్లడించింది.

షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు మే 13న, పీడీ పోస్టులకు మే 17 న పరీక్ష నిర్వహించాల్సి ఉంది.

ఇప్పుడు ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (CBRT) సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కమిషన్ పరీక్షల షెడ్యూలు జారీ చేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ (tspsc paper leakage) అంశం అనంతరం ఎక్కువ శాతం పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (cbrt) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు.

★ పాలిటెక్నిక్ లెక్చరర్ నూతన షెడ్యూల్ :

◆ సెప్టెంబరు 4

ఉదయం : పేపర్-1, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

మధ్యాహ్నం : : పేపర్ -2, సివిల్ ఇంజినీరింగ్, టన్నరీ, జియాలజీ, ఫిజిక్స్

◆ సెప్టెంబరు 5 :

ఉదయం : పేపర్-1, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

మధ్యాహ్నం : పేపర్ -2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుట్ వేర్ టెక్నాలజీ, లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ), మెటలర్జీ, ఫార్మసీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.

◆ సెప్టెంబరు 6 :

ఉదయం : పేపర్-1, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

మధ్యాహ్నం : పేపర్ -2, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్

◆ సెప్టెంబర్ – 08 :

ఉదయం : పేపర్-1, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

మధ్యాహ్నం : పేపర్ -2, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, టెక్స్ట్ టైల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్.

★ ఫిజికల్ డైరెక్టర్ల పరీక్ష షెడ్యూల్..

◆ సెప్టెంబరు 11

ఉదయం : పేపర్-1 – జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

మధ్యాహ్నం : పేపర్ -2 – ఫిజికల్ ఎడ్యుకేషన్.