హైదరాబాద్ (సెప్టెంబర్ – 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC JL EXAMS SCHEDULE ) ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష తేదీలను వెల్లడించింది.
జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 12 అక్టోబర్ 03 వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు.
★J.L. EXAMS SCHEDULE :
సెప్టెంబర్ – 12 – ఇంగ్లీషు
సెప్టెంబర్ – 13 – బోటనీ & ఎకానమిక్స్
సెప్టెంబర్ – 14 – మ్యాథ్స్
సెప్టెంబర్ – 20 – కెమిస్ట్రీ
సెప్టెంబర్ – 21 – తెలుగు
సెప్టెంబర్ – 22 – ఫిజిక్స్ & జూవాలజీ
సెప్టెంబర్ – 25 – కామర్స్
సెప్టెంబర్ – 26 – సివిక్స్, అరబిక్, ప్రెంచ్
సెప్టెంబర్ – 27 – హిందీ
సెప్టెంబర్ – 29 – హిస్టరీ, సంస్కృతం
అక్టోబరు – 03 – ఉర్దూ