హైదరాబాద్ (మే – 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి మే 21, 22వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT)పద్ధతిలో నిర్వహించనన్న పరీక్షల హల్ టికెట్లు విడుదల చేసింది.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను (TSPSC AEE EXAM HALL TICKETS) అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. కావున అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా టిఎస్పిఎస్సి తన ప్రకటనలో తెలిపింది.