హైదరాబాద్ (నవంబర్ – 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వంటి ఉద్యోగాల నియామక రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ (tspsc released 833 ae jto exam preliminary key) ను విడుదల చేసింది.
రాష్ట్రంలో 833 ఏఈ, టీవో, జేటీవో ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12న టీఎసీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 18, 19, 20, 25 న ఇందుకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరిగాయి.
రెస్పాన్స్ షీట్స్ & ప్రాథమిక కీ నవంబర్ – 30 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది.
ప్రాథమిక కీలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు టిఎస్పిఎస్సి ఇవ్వబడిన లింకు ద్వారా నవంబర్ 2 నుండి నవంబర్ 4 సాయంత్రం 5.00 గంటల వరకు పిడిఎఫ్ రూపంలో అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. ఇతర మార్గాలలో వ్యక్తం చేసే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు.