హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి నాలుగు రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ లను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. Tspsc release Junior lecturer exam preliminary key
సెప్టెంబర్ 12, 13, 14వ తేదీల్లో జరిగిన జనరల్ స్టడీస్/ మెంటల్ ఎబిలిటీ(పేపర్-1), ఇంగ్లిష్, బోటనీ, ఎకనామిక్స్, మ్యాథ్స్(పేపర్-2) పరీక్షల ‘ కీ’ లను సెప్టెంబర్ 23న విడుదల చేసి అక్టోబర్ 22 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతాలు స్వీకరించనుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షలు అక్టోబర్ 3 వరకు కొనసాగనున్నాయి. మల్టీజోన్-1లో 724, మల్టీజోన్-2లో 668 పోస్టులను భర్తీ కానున్నాయి.