Home > JOBS > TGPSC > TSPSC > TSPSC – మార్కులు సమానంగా వచ్చినప్పుడు ర్యాకింగ్ విధానం

TSPSC – మార్కులు సమానంగా వచ్చినప్పుడు ర్యాకింగ్ విధానం

BIKKI NEWS (FEB. 10) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినప్పుడు వారి ర్యాంకింగ్ లు (TSPSC RANKING CRITERIA IN RESULTS) ఏ విధంగా కేటాయిస్తారో పేర్కొంది.

2022 ఏప్రిల్ నుండి విడుదలైన నోటిఫికేషన్ల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ర్యాంకింగ్ లను తీసే విధానం మీద ప్రకటన వెలువరించింది.

1) మార్కులు సమానంగా వచ్చినప్పుడు మొదటగా వారి స్థానికతను పరిగణలోకి తీసుకొని స్థానిక అభ్యర్థులకు మొదటి ర్యాంకును ఇవ్వడం జరుగుతుంది.

2) మార్కులు, స్థానికత కూడా సమానంగా ఉన్నప్పుడు వారి పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

3) మార్కులు, స్థానికత, పుట్టిన తేదీ కూడా సమానంగా ఉన్నప్పుడు జనరల్ స్టడీస్ పేపరు కాకుండా, సబ్జెక్ట్ పేపర్లలో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

4) మార్కులు, స్థానికత, పుట్టిన తేదీ, జనరల్ స్టడీస్ పేపరు కాకుండా, సబ్జెక్ట్ పేపర్లలో మార్కులు కూడా సమానంగా ఉన్నప్పుడు ఆ పోస్టుకు విద్యార్హత డిగ్రీ ముందు పాసైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

5) మార్కులు, స్థానికత, పుట్టిన తేదీ, జనరల్ స్టడీస్ పేపరు కాకుండా, సబ్జెక్ట్ పేపర్లలో మార్కులు, విద్యార్హత డిగ్రీ ముందు పాసైన తేదీ కూడా సమానంగా ఉన్నప్పుడు ఆ పోస్టుకు గల విద్యార్హత లో వచ్చిన ఎక్కువ శాతం మార్కులు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

6) పైవన్నీ కూడా సమానంగా ఉంటే విద్యార్హతలలో ఎక్కువ విద్య అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

7) అప్పటికి సమానంగా ఉంటే అభ్యర్థి యొక్క ఉన్నత విద్యార్హత లో మార్కుల పర్సంటేజ్ ప్రకారం ర్యాంకులు ఇవ్వబడును.

8) చివరకు కమిషన్ యొక్క నిర్ణయమే బ్యాంకింగ్ విధానంలో ఫైనల్.