TSPSC : మూడు పరీక్షల కీలో అభ్యంతరాలకు నేటితో ఆఖరు

హైదరాబాద్ (జూన్ – 03) : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డ్రగ్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకూ జరిగిన పరీక్షల యొక్క ప్రిలిమినరీ కీలో అభ్యంతరాలు తెలపడానికి నేటి సాయంత్రం 5.00 గంటల వరకు సమయం కలదు.

ప్రిలిమినరీ కీలో వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ సూచనలతో టీఎస్పీఎస్సీ ఫైనల్ కీని విడుదల చేయనున్నది.

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 8న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెల 8, 9, 21, 22 తేదీల్లో ఆన్లైన్ పద్దతిలో పరీక్ష నిర్వహించింది. అభ్యంతరాల స్వీకరణ కోసం జూన్ 1 నుంచి 3న సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అవకాశం కల్పించింది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in