హైదరాబాద్ (మే – 05) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను, 17న జరగాల్సిన ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను రీషెడ్యూల్ చేసింది.
సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష, ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను సెప్టెంబర్ 11కి రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొంది.