TSPSC తాత్కాలిక చైర్మన్ గా కృష్ణారెడ్డి.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాత్కాలిక నూతన చైర్మన్ గా కృష్ణారెడ్డి నియమితులయ్యారు. పూర్తిస్థాయిలో చైర్మన్ నియమించే వరకు కృష్ణా రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు.

18 వ తారీకుతో ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి మరియు ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారికి గురువారం వీడ్కోలు పలికారు. మిగిలిన ఇద్దరు లో సీనియర్ అయిన కృష్ణా రెడ్డి కి TSPSC తాత్కాలిక చైర్మన్ గా ఈ బాధ్యతలు అప్పగించారు.

Follow Us@