హైదరాబాద్ (ఎప్రిల్ – 28) : ఇంటర్మీడియట్, టెక్నికల్ విద్యా వ్యవస్థ లో భర్తీ చేయనున్న 71 లైబ్రేరియన్ నియామక పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17 నే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పష్టం చేసింది.
పరీక్షకు వారం ముందు వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని పేర్కొంది. మే 17 న ఉదయం, సాయంత్రం సెషన్స్ లలో CBRT పద్దతిలో పరీక్ష జరగనుంది.