హైదరాబాద్ (మే – 09) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇంటర్మీడియట్, టెక్నికల్ విద్యా వ్యవస్థలో భర్తీ చేయనున్న 71 లైబ్రేరియన్ నియామక పరీక్ష యొక్క హల్ టికెట్లు (Librarian Exam Hall Tickets) మే 10 వ తేదీ నుంచి అందుబాటులో రానున్నాయి. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17న రెండు సెషన్స్ లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్దతిలో జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పష్టం చేసింది.
మే 17న ఉదయం 10.00 గంటల నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 2.39 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.