Home > JOBS > TGPSC > TSPSC > TSPSC – GROUP -1, 2, 3, 4 నోటిఫికేషన్ ల ప్రస్తుత పరిస్థితి

TSPSC – GROUP -1, 2, 3, 4 నోటిఫికేషన్ ల ప్రస్తుత పరిస్థితి

BIKKI NEWS (JAN. 30) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్- 3, గ్రూప్ – 4 నోటిఫికేషన్ లను (tspsc group 1,2,3,4 notification present status) విడుదల చేసిన విషయం తెలిసిందే. అవి ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో వీటి పరిస్థితి ఎలా ఉండనుందో చూద్దాం…

★ GROUP – 1 NOTIFICATION

503 గ్రూప్ – 1 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీని మీద ఇప్పటివరకు టిఎస్పిఎస్సి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హమీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి నూతన నోటిఫికేషన్ విడుదల చేస్తుందా లేదా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తుందా. అనేది చూడాల్సి ఉంది.

★ GROUP – 2 NOTIFICATION

గ్రూప్ 2 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వివిధ కారణాలతో వాయిదా పడింది. 780 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జనవరి 6 7 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది.

★ GROUP – 3 NOTIFICATION

1,380 గ్రూప్ – 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. నూతన ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

★ GROUP – 4 NOTIFICATION

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,039 గ్రూప్ – 4 పోస్టుల కొరకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించింది. ప్రాథమిక, తుది కీలను కూడా విడుదల చేసింది. ఫలితాల విడుదల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. నూతన ప్రభుత్వం వీలైనంత త్వరగా తూది ఫలితాలను విడుదల చేసి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది.