GROUP – 4 : ఒక్కో పోస్టుకు 116 మంది దరఖాస్తు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 04) :తెలంగాణలో విడుదల చేసిన గ్రూప్-4 ఉద్యోగ నోటిఫికేషన్ కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఒక్కో పోస్టుకు 116 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ 1న 8,039 ఉద్యోగాలతో విడుదలైన గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇటీ వల 141 పోస్టులను జతచేశారు. దీంతో మొత్తం 8,180 పోస్టులకు 9లక్షలపైగా దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

★ హాస్టల్ వార్డెన్ పోస్టులకు 1,45,358 దరఖాస్తులు

పలు ప్రభుత్వ శాఖల్లో హాస్టల్ వార్డెన్, మ్యాట్రన్, లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు శుక్రవారం తుది గడువు నాటికి 1,45,358 దరఖాస్తులొచ్చినట్టు అనితారామచంద్రన్ తెలిపారు. ఆగస్టులో పరీక్ష ఉంటుందని చెప్పారు.