హైదరాబాద్ (జూన్ -29) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించనున్న గ్రూప్ – 4 పరీక్షలకు కఠిన నిబంధనలను (GROUP 4 EXAM RULES and REGULATIONS) అమలు చేయనుంది.
పేపర్ లీకేజ్ మరియు పలు అంశాల నేపథ్యంలో పరీక్షను కట్టుదిట్టమైన నియమనిబంధనల మధ్య నిర్వహించనుంది.
◆ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు :
1) పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందు నుండే అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రం గేట్లను 15 నిమిషాల ముందే మూసివేస్తారు.
2) ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షకు 15 నిమిషాల ముందు వరకు మాత్రమే అనుమతిస్తారు తరువాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
3) ఉదయం పరీక్షకు 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.15 గంటల తర్వాత అనుమతించరు.
4) అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు కచ్చితంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావలసి ఉంటుంది.
5) అభ్యర్థి కాకుండా వేరొక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వస్తే ఆ అభ్యర్థి మీద క్రిమినల్ కేస్ తో పాటు భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు.
6) బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు.
7) ఎలక్ట్రానిక్ వస్తువులు రిమోట్ వస్తువులు ఎలాంటి విలువైన వస్తువులను తీసుకొని రావద్దని స్పష్టం చేసింది.
8) అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని షూస్ వేసుకొని రాకూడదని తెలిపింది.
9) పరీక్షలు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ మాత్రమే ఉపయోగించాలి… పెన్సిల్ లేదా ఇంక్ లేదా జెల్ పెన్నులు ఉపయోగిస్తే ఆ ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు.
10) పరీక్ష కేంద్రం వద్ద మరియు కేంద్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో నినాదాలు, ధర్నాలకు అనుమతి లేదు. అలా చేసిన అభ్యర్థుల మీద క్రిమినల్ కేసులు పెట్టబడును.