హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,039 గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ – 30 – 2022 నుంచి ప్రారంభం అయింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ.
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి.(రిజర్వేషన్ ప్రకారం సడలింపు కలదు)
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ – 30 – 2022
◆ దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి – 30 – 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
◆ పరీక్ష విధానము : 2 పేపర్లు కలిగి ఉంటుంది. 300 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
- పేపర్ – 1(జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు
- పేపర్ – 2 (సెక్రటెరీయల్ ఎబిలిటీస్) – 150 మార్కులు
◆ దరఖాస్తు ఫీజు : 200/- + 80/-
◆ పరీక్ష తేదీ : ఎప్రిల్/మే – 2023