GROUP 1 : ప్రిలిమ్స్ కీ లో 8 ప్రశ్నలు తొలగింపు

హైదరాబాద్ (ఆగస్టు 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన GROUP – 1 PRELIMS FINAL KEY లో 8 ప్రశ్నలను పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలు లేని కారణంగా తొలగించినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది. అలాగే మరో రెండు ప్రశ్నలకు ప్రాథమిక కీలో ఇచ్చిన ఆప్షన్లను మార్చింది.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనల మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది.

గ్రూప్-1ను 150 మార్కులకు నిర్వహించగా, తాజాగా 8 ప్రశ్నలను తొలగించడంలో 142 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11ననిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన 2,33,506 అభ్యర్థులకు చెందిన డిజిటల్ ఓఎమ్మార్ షీట్లను, మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ జూన్ 28న విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై జూలై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు ప్రతిపాదనలను కమిషన్ ముందు ఉంచింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కమిషన్ మంగ ళవారం తుది కీని వెబ్సైట్లో పొందుపరిచింది.

★ కీ లో సవరణలు ఇలా..

సరైన సమాధానాలు లేని కారణంగా 3,4, 5, 46, 54, 11, 128, 135 నంబర్గ ల ప్రశ్నలను తొలగించారు.

ప్రశ్న నంబర్ 38కు ప్రాథమిక కీలో 3 ఆప్షనన్ను సరైనదిగా ప్రకటించగా, తాజాగా ఆప్షన్ 2కు మార్చారు.

ప్రశ్నసంఖ్య 59కు ప్రాథమిక కీలో ఆప్షన్ 1 సరైనదిగా ఇవ్వగా, తాజాగా ఆప్షన్ 3 సరైన సమాధానంగా ప్రకటించారు.