BIKKI NEWS (MARCH 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువ నేటితో ముగిసింది. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షలు అని టిఎస్పిఎస్సి ప్రకటించింది. (TSPSC GROUP 1 EDIT OPTION)
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులలో ఏవైనా తప్పిదాలు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని టిఎస్పిఎస్సి కల్పించింది. మార్చి 23 నుండి మార్చి 27 వరకు ఆన్లైన్ పద్ధతిలో ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.
గ్రూప్ – 1 ద్వారా మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 715 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.