TSPSC : గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష పేపర్ విధానం వెల్లడి

హైదరాబాద్ (జనవరి – 18) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 పోస్టుల భర్తీకి గాను విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షల ప్రశ్నా పత్రం మోడల్ ను TSPSC విడుదల చేసింది.

ఇటీవలే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి 25,050 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసిన విషయము తెలిసిందే.

మెయిన్స్ పరీక్షల్లో క్వాలిఫికేషన్ టెస్ట్ ఇంగ్లీష్ తో పాటు, ఆరు ప్రధాన పేపర్లు ఉంటాయి. ఈ ఆరు ప్రధాన పేపర్లకు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

★ పరీక్ష పేపర్ ప్యాటర్న్ ::

◆ క్వాలిఫయింగ్ టెస్టు (జనరల్ ఇంగ్లీష్ పదవ తరగతి స్టాండర్డ్)

15 ప్రశ్నలను ఇవ్వనున్నారు. 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది మ. ఈ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారివి మాత్రమే మిగతా 6 పేపర్లు దిద్దుతారు.

◆ పేపర్ – 1 జనరల్ ఎస్సే :

మూడు సెక్షన్లలో… సెక్షన్ కి మూడు చొప్పున ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రతి సెక్షన్ నుండి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 50 మార్కులు.

◆ పేపర్ – 2 హిస్టరీ, కల్చర్ & జాగ్రపి :

ఈ పేపర్ లో కూడా మూడు సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్ లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. మొదటి రెండు ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మిగతా మూడు ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ లో రెండిట్లో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రశ్నకు పది మార్కులు చొప్పున సెక్షన్ 5 ప్రశ్నల చొప్పున… 15 ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా 150 మార్కులను కేటాయించారు.

◆ పేపర్ – 3 ఇండియన్ సోసైటీ, కాన్సిస్టిట్యూషన్ & గవర్నెన్స్ :

ఈ పేపర్ లో కూడా మూడు సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్ లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. మొదటి రెండు ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మిగతా మూడు ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ లో రెండిట్లో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రశ్నకు పది మార్కులు చొప్పున సెక్షన్ 5 ప్రశ్నల చొప్పున… 15 ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా 150 మార్కులను కేటాయించారు.

◆ పేపర్ – 4 ఎకానమీ & డెవలప్‌మెంట్

◆ పేపర్ – 5 సైన్స్ & టెక్నాలజీ & డెటా ఇంటర్‌ప్రటేషన్

ఈ పేపర్ లో కూడా మూడు సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్ లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. మొదటి రెండు ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మిగతా మూడు ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ లో రెండిట్లో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రశ్నకు పది మార్కులు చొప్పున సెక్షన్ 5 ప్రశ్నల చొప్పున… 15 ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా 150 మార్కులను కేటాయించారు.

◆ పేపర్ – 6 తెలంగాణ మూవ్‌మెంట్ & స్టేట్ ఫార్మేషన్

ఈ పేపర్ లో కూడా మూడు సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్ లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. మొదటి రెండు ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మిగతా మూడు ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ లో రెండిట్లో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రశ్నకు పది మార్కులు చొప్పున సెక్షన్ 5 ప్రశ్నల చొప్పున… 15 ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా 150 మార్కులను కేటాయించారు.

GROUP 1 Q.P. PATTERN