TSPSC : భూగర్భ జల శాఖ గెజిటెడ్ ఉద్యోగ హల్ టిక్కెట్లు విడుదల

హైదరాబాద్ (జూలై – 13) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జల శాఖలో గెజిటెడ్ పోస్టుల బర్తీ కోసం జూలై 18, 19వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను(TSPSC GROUD WATER DEPARTMENT GAZETTED OFFICERS EXAM HALL TICKETS) విడుదల చేసింది.

జూలై 13 నుండి జూలై 18, 19 తేదీలలో పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హాల్ టికెట్లు ఇవ్వబడిన నిబంధనలు తప్పకుండా పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.

జూలై 18, 19వ తేదీలలో రెండు సెషన్స్ చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:00 నుండి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

TSPSC GROUD WATER DEPARTMENT GAZETTED OFFICERS EXAM HALL TICKETS