హైదరాబాద్ (మే – 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC) పలు సంక్షేమ శాఖల్లోని 581 వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మాట్రన్, లేడి సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కల్పించింది.
మే 17 నుండి 20వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఆగస్టు మాసంలో నిర్వహించనున్నారు.