హైదరాబాద్ (డిసెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,392 లెక్చరర్ల పోస్టులకు TSPSC ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిసెంబర్ 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో రాతపరీక్షలు ఉండొచ్చని తెలిపింది.

అత్యధికంగా మ్యాథ్స్ 154, ఇంగ్లిష్ 153, జువాలజీలో 128, హిందీలో 117, కెమిస్ట్రీలో 113, ఫిజిక్స్ 112 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 91 ఫిజికల్ డైరెక్టర్, 40 లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది