BIKKI NEWS (MARCH 24) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పోస్టులకు సంబంధించి మహిళలకు జీవో నెంబర్ మూడు ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ ఒక ప్రకటన (TSPSC DISTRICT and POST WISE ROASTER) విడుదల చేశారు.
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెట్‌సైట్ లో పొందుపరిచామని వివరించారు.
నోటిఫికేషన్‌లోని ఇతర అంశాలను మార్పు చేయలేదని స్పష్టం చేశారు. గత నెలలో గ్రూప్-4 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది.