GROUP 2 EXAM – పరీక్ష నిర్వహణ పై 14న నిర్ణయం

హైదరాబాద్ (ఆగస్టు – 11) : గ్రూప్-2 పరీక్ష వివాదంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సోమవారం (ఆగస్టు 14న) తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని TSPSC తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

“గ్రూప్ – 2 కు ఐదున్నర లక్షల మంది అప్లై చేశారని… గురుకుల టీచర్ పరీక్షలకు 60 వేల మంది మాత్రమే అప్లై చేశారని.. గ్రూప్ – 2 వాయిదా వేయాలంటూ 150 మంది మాత్రమే పిటిషన్ వేశారని హైకోర్టులో టిఎస్‌పిఎస్‌సి న్యాయవాదులు వివరించారు.

అయితే కచ్చితంగా నిర్ణయం ప్రకటించాలని TSPSCని కోర్టు ఆదేశించింది. పరీక్షను రీషెడ్యూల్ లేదా వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం గ్రూప్ – 2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీలలో నిర్వహించనున్న విషయం తెలిసిందే.